• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • విషాదం నింపిన దీపావళి .. 50 మంది కళ్ళకు గాయాలు .. 8 మంది కళ్ల పరిస్థితి విషమం

    Posted on 07 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 09.30am)
               .    దీపావళి పండగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నిపింది. టపాసులు పేలుస్తూ కళ్లకు గాయాలు కావడంతో అనేక మంది నగరంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో చేరారు. టపాసులు పేల్చిన వారే కాకుండా రోడ్లపై వెళుతున్న వారు కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి కొందరికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆస్పత్రికి మొత్తం 50 మంది వరకు బాధితులు రాగా వీరిలో 8 మంది కళ్ల పరిస్థితి విషమయంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వీరికి శస్త్రచికిత్స నిర్వహిస్తామని తెలిపారు. మిగతా 42 మంది కళ్లకు చిన్న గాయాలే అయ్యాయని వారికి చికిత్స అందించిన తర్వాత ఇళ్లకు పంపినట్లు చెప్పారు. గాయాలపాలైన వాళ్లలో చిన్న పిల్లలే కాకుండా అన్ని వయసులు వారూ ఉన్నారని సరోజినీ కంటి ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ బేగ్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచే కాకా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు వెల్లడించారు. దీపావళి రోజు రాత్రి నలుగురు వైద్యులు అందుబాటులో ఉండి బాధితులకు చికిత్స అందించినట్లు తెలిపారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!