• vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • కార్తీకమాసం ఏర్పాట్లపై ఎమ్మెల్యే అంజిబాబు సమీక్ష సమావేశం (8/11/18)

    Posted on 07 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 09.30am)
               కార్తీకమాసం ప్రారంభం కావడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అధికారులకు సూచించారు. పంచారామక్షేత్రమైన భీమవరం శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో అధికారులతో దేవస్థాన సభ్యులతో ఎమ్మెల్యే అంజిబాబు సమీక్షించారు. కార్తీకమాసం సోమవారంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, దూరప్రాంతాల్లోంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చూడాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్, చైర్మన్ వేగేశ్న రంగరాజు మాట్లాడుతూ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశామని అన్నారు. పోలీస్ బందో బస్తును వన్ టౌన్ సిఐ కె గోవిందరాజు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వన్ టౌన్ సిఐ కె గోవిందరాజు, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!