• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • భక్తులతో కిటకిటలాడిన సోమేశ్వరాలయం (8/11/18)

    Posted on 07 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 10.00am)
                   హరహర మహాదేవ శంభో శంకరా.. అంటూ శివ నామస్మరణతో పంచారామక్షేత్రాలు మారుమ్రోగాయి. గురువారం కార్తీక మాసం ప్రారంభం కావడంతో పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికీ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దోషాలు తొలగిపోవాలంటూ అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. ద్వజ స్థంభం వద్ద దీపాలను వేలిగించారు. పలువురు దాతలు భక్తులకు ప్రసాదాలను అందించారు.   కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వేగేశ్న రంగరాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 
     
     
     
    Be the first one to comment. Click here to post comment!