• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గృహ నిర్బంధంలో నేతలు .. అడ్డుకున్న పోలీసులు

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/11/18.   09.30am)
                తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల సవాళ్ల పర్వం చినికిచినికి గాలివానలా మారింది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు జడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి  బాపిరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే  పైడికొండల  మాణిక్యాలరావు (భాజపా) కొంతకాలంగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. పత్రికాముఖంగా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. బహిరంగ చర్చకు సిద్ధమైన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు భారీగా బలగాలను దించి భద్రతను కట్టుదిట్టం చేసి.. నాయకులను దిగ్బంధించారు. జడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజును, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును కొవ్వూరు డీఎస్పీ ఎస్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముందుగానే గృహ నిర్బంధం చేశారు. చర్చ నిర్వహించాలని నిర్ణయించిన వెంకట్రామన్నగూడెంలోను, పట్టణంలోను 144 సెక్షన్‌ను విధించారు. చర్చకు రాకుండా పోలీసులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో బాపిరాజు వెంకట్రామన్నగూడెంలో పుసులూరి పుల్లయ్య ఇంట్లో ఉండిపోయారు. ఆయన్ను పట్టణంలోని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ను ఆయన నివాసం నుంచి బయటకు రానీయకుండా ట్రాఫిక్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలు భాస్కరరావు, మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గృహ నిర్బంధం విధించారు. వెంకట్రామన్నగూడెంలోని ప్రధాన వీధులతోపాటు చుట్టు పక్కల ఊర్ల నుంచి గ్రామానికొచ్చే రహదారుల్లో ఎస్సైలు, పోలీసులు విధులు నిర్వర్తించారు. బాపిరాజును పోలీసులు కారులో నల్లజర్ల పంపించారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి బాపిరాజు పూలమాల వేశారు.
                   బహిరంగ చర్చ వేదిక కారణంగా శాంతిభద్రతలకు భంగం వాటిళ్లకుండా తాడేపల్లిగూడెం పట్టణం, వెంకట్రామన్నగూడెంలో 144 సెక్షన్‌ విధించి జడ్పీ అధ్యక్షుడు బాపిరాజు, శాసనసభ్యుడు మాణిక్యాలరావులను గృహనిర్బంధం చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పారదర్శకంగా పోలీసులు తమ విధులు నిర్వహించారన్నారు. ఇరువురిపై 151 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి కొట్లాటలు జరగకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారని తెలిపారు. పోలీసులు కొట్టారని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. వీటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలు నిర్వహణలో  భాగంగానే విధులు నిర్వర్తించామని తెలిపారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!