• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • బిజెపి నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం (9/11/18)

    Posted on 08 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/11/18.   11.30am)
             రాష్ట్రంలో అవినీతి పాలన చేస్తూ, ధర్మమైన వ్యక్తులను నిలువరిస్తున్నారని, అవినీతిని వ్యతిరేకిస్తున్న బిజెపి నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ పోర్ట్ డైరెక్టర్ పాకా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్ లో పట్టణ బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తి జడ్పీ ఛైర్మన్‌ బాపిరాజు అని, సవాల్‌ విసిరిన వారు ముందుకు రావాలి కాని పోలీసులతో అరెస్టులు చేయించి అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో తెదేపా నేతలు సవాల్‌ చేస్తారు కాని బహిరంగ చర్చకు రారని విమర్శించారు.  రాష్ట్రంలో ఇసుక, మట్టి, భూ కుంభకోణాల్లో ప్రభుత్వం రూ.కోట్లలో అవినీతికి పాల్పడుతోందని, దీనిని బహిర్గతం చేసేవరకు ఊరుకోమంటూ హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తెదేపా భూస్థాపితం అవుతుందని విమర్శించారు. ఈ రకమైన చర్యలకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి బాపిరాజును ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, కాయిత సురేంద్ర, అల్లూరి సాయి దుర్గరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!