• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • 70 లక్షల కార్యకర్తలను కలిగిన అతిపెద్ద పార్టీ టిడిపి .. భీమవరం టిడిపి (9/11/18)

    Posted on 09 Nov, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/11/18.   04.30pm)
                     భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో స్థానిక 19,21వ  వార్డులలో తెలుగుదేశం సభ్యత్వ పునరుద్ధణ కార్యక్రమాన్ని పట్టణ పార్టీ అధ్యక్షులు తోట బోగయ్య  ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి సారిగా పార్టీ కార్యకర్తకు 2 లక్షల ప్రమాదబీమా అందిస్తున్న టిడిపి 70 లక్షలను కార్యకర్తలను కలిగిన అతిపెద్ద పార్టీని అన్నారు. కౌన్సిలర్ ఎండి అల్లావుద్దీన్ నౌషాద్ మాట్లాడుతూ పట్టణంలో 7 కుటుంబాల వారికీ ప్రమాదబీమా రూ 2 లక్షలు, రైల్వేస్టేషన్ లో గుండెపోటుతో మరణించినవారికి రూ 2 లక్షలు అనారోగ్యం మరణించిన మహిళలకు రూ 25 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించిన పార్టీ టిడిని అని అన్నారు. కార్యదర్శి ఉప్పుకూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2016-18 సంవత్సరంకు గాను 12 వేల మంది సభ్యులు కలిగి ఉండగా 2018-20 సంవత్సరంకుగాను 15 వేలమంది సభ్యులుగా నమోదును ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎస్ కె షెహన్ షా, ఎండి షాబు, పడమట నరసింహమూర్తి, కోడేంటి సాంబశివరావు, శానంఫణి కుమార్, ఎద్దు ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!