• Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • అక్రమ ఆక్వాచెరువులతో త్రాగునీటి చెరువులు నాశనం. సిపిఎం బలరాం విమర్శ (15/11/18)

    Posted on 15 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/11/18..    04.30pm)
                ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొనేది ఆక్వా జోన్ లు కాదని జిల్లాకి డేంజర్ జోన్లని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం విమర్శించారు. స్థానిక సుందరయ్య భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. జైల్లో 29 మండలాలను పూర్తి ఆక్వా జోన్ పరిధిలోనికి తీసుకువస్తుందని, జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఆక్వాసాగు జరుగుతుందని అన్నారు. పచ్చని వ్యవసాయ పంటలు అభివృద్దే చెందే జిల్లాలో పంటలు నాశనం చేసే విధంగా ప్రభుత్వం జిల్లాను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావడం దారుణమని అన్నారు. ఇప్పటికే అక్రమ ఆక్వాచెరువులతో త్రాగునీటి చెరువులు నాశనమై జిల్లా జలకాలుష్యంగా మారిందని అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన లక్షలాది వ్యవసాయ కార్మికులు దళితులు ఇతర కులాల్లో ఉన్న పేదల పూర్తిగా నష్టపోయి ఇతర జిల్లాలకు వలసలుపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. జెఎన్ వి గోపాలన్ మాట్లాడుతూ జిల్లాకి కాలుష్య భూతాన్ని తెచ్చి జనావాసాల మధ్య పుడ్ పార్క్ నిర్మించడం తగదు తక్షణం మెగా ఆక్వా పుడ్ పార్క్ నిర్మాన్ని నిలుపుదల చేయాలనీ డిమాండ్ చేశారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!