• Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • పేదలకు అండ తెలుగుదేశం జెండా .. ఎమ్మెల్యే అంజిబాబు (15/11/18)

    Posted on 15 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/11/18..    04.30pm)
                పేదలందరూ సుఖంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి సంక్షేమ పధకాలను అమలు చేస్తూ పేదలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.  టిడిపి పట్టణ ఆధ్వర్యంలో గురువారం 30వ వార్డులో టిడిపి సభ్యుత్వా నమోదు పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మీరంతా భాగస్వాములు కావటానికి టిడిపిలో సభ్యుత్వం పొందాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఎటువంటి అవినీతికి తావులేకుండా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఎపిఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణ రాజు, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, తోట బోగయ్య, మెరగని నారాయణమ్మ, ఇందుకూరి రామలింగరాజు, పామర్తి వెంకట్రామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, మైలబత్తుల ఐజాక్ బాబు, వేలూరి సుబ్రహ్మణ్యం, యాళ్ల వెంకటేశ్వరరావు, గొంతిన శ్రీను, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!