• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • 19న ఎస్ఆర్ కెఆర్ లో చిత్ర విశ్వకర్మ అవార్డులు -18 ప్రాంతీయ సదస్సు (16/11/18)

    Posted on 16 Nov, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/11/18..  05.30pm)
                   ఈనెల 19వ తేదీన భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐసీటీఈ, ఐఎస్ టీఈ చిత్ర విశ్వకర్మ అవార్డులు -18 ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. సదస్సు కో ఆర్డినేటర్ ఎన్ గోపాలకృష్ణ మూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రాజెక్టులు చేపట్టిన వారిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తారని అన్నారు. 1607 ప్రాజెక్టులు ఎంపికకాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచు 816 ప్రాజెక్టులు ఎంపికైయ్యాయని తెలిపారు. ఈ సదస్సులో 8 విభాగాలలో ఉత్తమమైనవి ఎంపిక చేస్తారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ సాగి విఠల్ రంగరాజు అధ్యాపకులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!