• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • అమర్ అక్బర్ ఆంటొని సినిమా రివ్యూ (16/11/18)

    Posted on 16 Nov, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/11/18..  05.30pm)
                    శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత నవీన్ యర్నెని నిర్మించారు.  
     

    కథ:
              రవితేజ (అమర్) – ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్‌ మంచి ఫ్రెండ్స్. న్యూయార్క్‌ లో కలిసి బిజినెస్ చేస్తుంటారు. తమ కంపెనీలో పని చేసే నలుగురు ఎంప్లాయిస్ (విలన్ )కి, తమ కంపెనీలో ట్వంటీ పర్సెంట్ షేర్ ఇచ్చి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తారు. కానీ వాళ్లు అమర్, ఐశ్వర్య పేరెంట్స్ ని దారుణంగా చంపేస్తారు. వారి నుండి అమ‌ర్- ఐశ్వ‌ర్య‌లు మాత్రం త‌ప్పించుకుంటారు. ఆ తరువాత అమ‌ర్ ఆ నలుగురు పై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ క్ర‌మంలో అమర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధ పడుతూ ఉంటాడు. ఆ డిజార్డర్ అమర్ పై ఎలాంటి ప్రభావం చూపింది. అసలు అక్బర్, ఆంటోనీ ఎవరు ? వాళ్లకి అమర్ కి ఏమిటి సంబంధం.. చివరికి అమర్ మిగిలిన ఆ నలుగురుని అమర్ ఎలా చంపుతాడు. చిన్న‌త‌నంలో దూరమయిన ఐశ్వ‌ర్య‌ను అమర్ మళ్ళీ ఎలా క‌లుసుకుంటాడు..? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలసిందే.
     

    ప్లస్ పాయింట్స్ :
          మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ తన ఎనర్జీ పెర్ఫార్మన్స్ తో పాటు తన టైమింగ్ తో కూడా ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా గత తన సినిమాలలో కంటే ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ పాత్రలో నటించిన ఇలియానా చాలా బాగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది..  కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. సునీల్ కూడా తన టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. జూనియర్ పాల్ గా నటించిన కమెడియన్ సత్య కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కామిక్ పాత్రల్లో కనిపించిన శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్ రెడ్డి తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేసారు. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సారి తన శైలికి భిన్నంగా ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేసారు. ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ నడిపారు.
     
    మైనస్ పాయింట్స్ :
             దర్శకుడు శ్రీను వైట్ల డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.
    దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఫస్ట్ విలన్ ని చంపటానికి హీరో పెద్ద బిల్డింగ్ ఎక్కి వెళ్లడం మరీ సినిమాటిక్ గా ఉంది. పైగా చాలా సన్నివేశాలు ఆడియన్స్ ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. దీనికి తోడు కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవలేదు. పైగా కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం, కామెడీ కూడా పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!