• Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • రోషగాడు సినిమా రివ్యూ (16/11/18)

    Posted on 16 Nov, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/11/18..  05.30pm)
                       బిచ్చగాడు’ చిత్రం తో తెలుగు లో మంచి గుర్తింపును తెచ్చుకున్నతమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం’ రోషగాడు’.  

     కథ :
                  పోలీస్ కానిస్టేబుల్ అయిన కుమార స్వామి (విజయ్ ఆంటొని ) తన తమ్ముడు రవిని ఎలాగైనా ఇన్స్పెక్టర్ ను చేయాలనీ అనుకుంటాడు కానీ చదువు అంటే ఏం మాత్రం ఇష్టముండని రవి హైదరాబాద్ పారిపోయి అక్కడి రౌడీ (బాబ్జి ) దగ్గర చేరి హత్యలు చేస్తుంటాడు. రెండు సంవత్సరాల తరువాత ఇన్స్పెక్టర్ గా హైదరాబాద్ కు బదిలీ మీద వచ్చిన కుమార స్వామి కి తన తమ్ముడు కలవడం అతను చేసే హత్యల గురుంచి తెలుసుకొని ఎన్కౌంటర్ లో రవిని చంపేస్తాడు కుమార స్వామి. కానీ తన తమ్ముడులాగే మరి కొంత మంది పిల్లలు కూడా బాబ్జి కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని కుమార్ స్వామి వారందరిని మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో కుమార స్వామి అనుకున్నది చేయగలిగాడు ? ఇంతకీ బాబ్జి ఎవరు ? అనేదే మిగితా కథ.

    ప్లస్ పాయింట్స్ :
                 సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది కుమార స్వామి పాత్ర. ఇక ఆ పాత్రలో నటించిన విజయ్ ఆంటొని తన సెటిల్డ్ పెర్ ఫార్మన్స్ తో మెప్పించాడు. సీరియస్ గా వుంటూ ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన ను కనబర్చాడు. ఇక విజయ్ కి సపోర్ట్ చేసే పాత్రలో నటించిన హీరోయిన్ నివేత పేతురాజ్ లుక్స్ పరంగా ఆకట్టుకొని తన ఎనర్జిటిక్ నటన తో మెప్పించింది. విలన్ పాత్రలో నటించిన డానియల్ బాలాజీ తన పాత్ర కు పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చేఎమోషనల్ సన్నివేశాలు తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది.

    మైనస్ పాయింట్స్ :
                దర్శకుడు గణేశా మంచి మెసేజ్ వున్న స్టోరీ ని ఎంచుకున్న దాన్ని తెర మీద తీసుకురావడంలో చాలా చోట్ల తడబడ్డాడు. ముఖ్యంగా స్లో నరేషన్ తో విసిగించాడు. దాంతో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది కానీ ఇంటర్వెల్ లో ఒక చిన్న ట్విస్ట్ తో సినిమా ఫై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సఫలమైన తరువాత అదే మ్యాజిక్ ని కొనసాగించలేక పోయాడు. సినిమా మొత్తం తమిళ్ ఫ్లేవర్ లో ఉండడం కొన్ని చోట్ల హద్దులు దాటడం వంటి అంశాలు కూడా తెలుగు ప్రేక్షకులకు రుచించవు. సంగీతం కూడా సినిమాకు మైనస్ అయ్యింది.
     
     
    Be the first one to comment. Click here to post comment!