• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • 6800 థియేటర్లలో 2.ఓ విడుదల (23/11/18)

    Posted on 22 Nov, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/11/18.. 10.00am)
                 శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘2.ఓ’ చిత్రం కోసం యావత్‌ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 3డీ సాంకేతికత, 4డీ సౌండ్‌తో ప్రేక్షకులకు సరికొత్త విందు అందించడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. ఈ నెల 29న ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. సాధారణంగా పండుగ రోజుల్లోనే రజనీకాంత్‌ సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ‘2.ఓ’ విడుదలనే పండుగలా జరుపుకోవడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో దీనిని రూపొందించిన ఆ సంస్థ.. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉండగా 6,800 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కేవలం విదేశాల్లోనే 4000 థియేటర్లలో విడుదలవుతున్నట్లు సమాచారం. ప్రభాష్‌ నటించిన ‘బాహుబలి 2’ చిత్రం 6,500 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆ రికార్డును ‘2.ఓ’ బ్రేక్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా కలెక్షన్‌ రికార్డులను కూడా బ్రేక్‌ చేసే అవకాశం ఉందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!