• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • 24 కిస్సెస్ సినిమా రివ్యూ (23/11/18)

    Posted on 23 Nov, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/11/18..    04.30pm)
                 
    కథ :
            ఆనంద్ కుమార్ ( ఆదిత్ అరుణ్ ) చిల్డ్రన్ ఫిలిం మేకర్. చిన్నపిల్లల సమస్యల ఫై చిత్రం కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాలంనుకుంటాడు. శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్ ) ఆనంద్ దగ్గర ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒకరి ఒకరు బాగా దగ్గర అవుతారు. దాన్ని శ్రీ లక్ష్మి ప్రేమ అనుకుంటుంది. కానీ మానవ సంబంధాల మీద నమ్మకం లేని ఆనంద్ కేవలం అది ఇష్టమే అనుకోని శ్రీలక్ష్మి తో పెళ్ళికి నో చెబుతాడు. దీనికి తోడు శ్రీ లక్ష్మి కి ఆనంద్ కు వేరే అమ్మాయిలతో సంబంధం వుందని తెలిసుకొని అతనికి దూరం కావాలనుకుంటుంది. ఆతరువాత ఆనంద్ ,శ్రీ లక్ష్మి మళ్ళీ కలిసారా? వారిద్దరూ పెళ్లిచేసుకున్నారా ? అనేదే మిగితా కథ.

    ప్లస్ పాయింట్స్ :
            ఆనంద్ పాత్రలో నటించిన ఆదిత్అరుణ్ ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. నటనాపరంగా అలాగే లుక్స్ పరంగా కూడా మెప్పించాడు. శ్రీ లక్ష్మి పాత్రలో నటించిన హెబ్బా గత సినిమాల్లో కంటే గ్లామర్ గా కనిపించి తన పాత్రకు న్యాయం చేసింది.

    ఇక మూర్తి పాత్రలో నటించిన రావు రమేష్ , హెబ్బా తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నరేష్ తమ పాత్రలను ఈజీ గా చేసుకుంటూవెళ్లిపోయారు. ఈచిత్రంలో మానసిక వైద్యుడిగా కనిపించిన రావు రమేష్ కు అలాగే ఆనంద్ కు మధ్య వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్ కు బాగా నచ్చుతాయి.

    మైనస్ పాయింట్స్ :
           దర్శకుడు అయోధ్య కుమార్ ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం ఒక మైనస్ అయితే దాన్ని తెర మీద చూపించిన విధానం మరి తీసికట్టుగా వుంది. ఒక ప్రేమ కథ కు చిన్న పిల్లల సమ్యసలు అనే అంశాన్ని ఎందుకు జోడించారో అర్ధం కాదు. ఇలాంటి ఒక కథను రాసుకున్నప్పుడు ఆ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయాలి కానీ ఈ చిత్రంలో ఆలా జరుగలేదు. సినిమాలో ఒక రొమాన్స్ తప్ప , ఎమోషన్స్ , కామెడీ లేకపోవడం మరో బలహీనత అలాగే క్లైమాక్స్ లో హీరోలో మార్పు వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా అనిపించవు. పాటలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ‘మిణుగురులు’ లాంటి అవార్డు విన్నింగ్ సినిమాను తీసిన దర్శకుడి నుండి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేం.
     
     
    Be the first one to comment. Click here to post comment!