• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • అంతర కళాశాలల యూనివర్శిటీ జట్ల టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..    10.00am)
               ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ మహిళల అంతర కళాశాలల యూనివర్శిటీ జట్ల టేబుల్ టెన్నిస్ ఎంపిక స్థానిక బివి రాజు కళాశాలలో జరిగాయి. ఈ జట్ల నుంచి యూనివర్శిటీ టీమ్ ను ఎంపిక చేశామని, 3 జట్లకు బహుమతు ప్రధానోత్సవం చేశారు. తణుకు ఎస్ కెఎస్ డి కళాశాల, ఏలూరు సిహెచ్ ఎస్ డిఎస్ టి కళాశాల, భీమవరం బివి రాజు కళాశాల గెలుపొందాయి.    వీరికి యూనివర్శిటీ తరుపున సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీలకు పంపుతామని యూనివర్శిటీ క్రీడా సంచాలకులు బి రామగోపాల్ తెలిపారు. ఎస్ కనకదుర్గ (తణుకు), పి లావణ్య (తణుకు), ఎస్ఆర్ శృతి (ఏలూరు), కె చంద్రసుధ, కె రాసిజ్ఞ (ఏలూరు) గెలుపొందిన వారికీ కళాశాల డైరెక్టర్ డి సూర్యనారాయణ, ప్రిన్సిపాల్ సిహెచ్ శ్రీనివాస్, ఎంసీఏ ఐఆర్ కె రాజు, ఇన్ ఛార్జ్ సత్యనారాయణ బహుమతులను అందించారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!