• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • నాలుగు రోజుల్లో రెండు అల్పపీడనాలు (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..    10.00am)
                భూమధ్యరేఖ పరిసర ప్రాంతాల్లోని బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. గురువారం ఒక అల్పపీడనం, ఆ తర్వాత 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న  దక్షిణాది రాష్ట్రాల తీరాలపై రానున్న 3 రోజుల్లో ప్రభావం ఉంటుందని, బలమైన గాలులు వీయొచ్చని హెచ్చరిస్తున్నారు. వేటకు  వెళ్లకూడదని మత్స్యకారులకు సూచించారు. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!