• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుద్దాం.. ఎమ్మెల్యే అంజిబాబు (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..    11.00am)
                      భారత రాజ్యంగా నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుద్దామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భారత రాజ్యంగా నిర్మాత బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి వేడుకలను గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రాహం వద్ద నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్నా ఆశించిన సుస్థిరమైన సమాజస్థాపనే మనందరి ధ్యేయమని అన్నారు. అంబేద్కర్ ప్రపంచ దేశాలు గౌరవించే వ్యక్తని, సామాన్య పౌరుని నైతిక అభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అని అన్నారు. రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో తోట బోగయ్య,  మద్దుల రాము, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, మలువలస రాము, మైలబత్తుల ఐజాక్ బాబు, గంట త్రిమూర్తులు, ఈపి శేషు, మామిడిశెట్టి ప్రసాద్, లంకి శ్రీనివాస్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు,
     
     
    Be the first one to comment. Click here to post comment!