• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలి .. గాదిరాజు బాబు (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..     04.30pm)
                భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని  డిఎన్నార్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు)  పిలుపు నిచ్చారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కళాశాలలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల అమలకు కృషి చేస్తోందన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటు పడుతోందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ స్ఫూర్తి తో ప్రతిఒక్కరూ సమ సమాజ స్థాపనకు పాటుపడాలని పిలుపు నిచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్‌ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎంవి రఘుపతిరాజు, పి సంజీవరావు, వీరయ్య, విజయ్ కుమార్, బి శాంతకుమారి, కె ఉషారాణి, బి జ్యోతి, పి హరికృష్ణంరాజు, గౌతమ్ కుమార్, ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!