• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ఈనెల 8న భీమవరం కెఏ పాల్ ప్రజాశాంతి సభ .. రాష్ట్ర కో ఆర్డినేటర్ హిప్నో కమలాకర్ (6/12/18)

    Posted on 06 Dec, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/18..     04.30pm)
                   అభద్రత, అశాంతితో రగిలిపోతున్న ప్రజల భవిష్యత్ కు భరోసా ఇస్తూ నవ్యంద్ర పునర్నిర్మాణం కోసం తమ పార్టీ చేపట్టబోయే చర్యలను వివరించేందుకు "ప్రజా శాంతి సభ" ఈనెల 8వ తేదీన భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ హిప్నో కమలాకర్ తెలిపారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రఖ్యాత సువర్తకులు డా కెఏ పాల్ ఆధ్యాత్మిక భావనలతో ఉపశమనం కలిగిస్తూనే ప్రజలకు సామాజిక రాజకీయ భద్రత కల్పించేందుకు ప్రజాశాంతి పార్టీ స్థాపించారని తెలిపారు. భీమవరం సభలో పార్టీ విధి విధానాలు నవ్యంద్ర అభివృద్ధి కోసం తమ కార్యాచరణను తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఏ పాల్ వివరిస్తారని తెలిపారు.  రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, మహిళలకు 50 శాతం సీట్లను కేటాయిస్తున్నామని అన్నారు. లక్ష్యసాధనలో తమ ప్రజాశాంతి  పార్టీ ఇతర పార్టీలను కలుపుకుని వెళుతుందని అన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!