• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • సుబ్రహ్మణ్యపురం సినిమా రివ్యూ (07/12/18)

    Posted on 07 Dec, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/12/18.. 04.30pm)
                       సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లగా వచ్చిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల అయింది. 

    కథ :
               నాస్తికుడైన సుమంత్ దేవాలయాల పరిశోధకునిగా పని చేస్తుంటుంటాడు. అదే సందర్భంలో హీరోయిన్ ఈషా రెబ్బాను ఇష్టపడతాడు. ప్రేమ కోసం ఆమె వెంట పడుతూ సరదాగా ఆట పట్టిస్తుంటాడు. ఈ క్రమంలో మరో పక్క సుబ్రహ్మణ్య పురం అనే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగు తుంటాయి. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగు తున్నాయో ? ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటో ? మొత్తం పది రోజుల్లో ఛేదిస్తానని సుమంత్ ఛాలెంజ్ చేస్తాడు. మరి.. సుమంత్ ఆ ఛాలెంజ్ ని ఛేదించడంలో విజయం సాధించాడా..? లేదా ? అయినా సుబ్రహ్మణ్యపురంలో అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ? చివరకి సుమంత్ ఈ ఆత్మహత్యలకు పరిష్కారం చూపించాడా ? లేడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

    ప్లస్ పాయింట్స్ :
                 ఈ సినిమాలో నాస్తికుడిగా మరియు దేవాలయాల పరిశోధకుడిగా కనిపించిన సుమంత్ చక్కని నటనను కనబరిచాడు. హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా సుమంత్ తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల రహస్యాన్ని చేధించే సన్నివేశాల్లో కూడా సుమంత్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.  కథా నాయకిగా నటించిన ఈషా రెబ్బా ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన సాయి కుమార్ తన గాంభీరమైన నటనతో మెప్పించారు. మరో కీలక పాత్ర అయిన హీరోయిన్ ఫాదర్ గా నటించిన సురేష్ కూడా చాలా బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ సురేష్ నటన చాలా బాగుంది. కమెడియన్ భద్రమ్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేయగా.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల తాలూకు సన్నివేశాలు కూడా ఆయన ఆకట్టుకునే విధంగా మలిచారు.

    మైనస్ పాయింట్స్ :
                  మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ఆ కాన్సెప్ట్ తగట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు.  సుబ్రహ్మణ్యపురంలో అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో అని హీరో చేధించే సన్నివేశాలు ఇంట్రస్టింగ్ గా మొదలైనప్పటికీ.. ఆ ఇంట్రస్ట్ చివరి వరకు మెయింటైన్ అవ్వదు. సినిమా లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. కథలోని మెయిన్ ఎమోషన్ ఇంకా బలంగా ఎలివేట్ అవకాశం ఉన్నట్లు అనిపించడం, సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు జరగడానికి బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!