• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వరస్వామి ఆలయం (18/12/18)

    Posted on 18 Dec, 2018 in General |   0 Comments
        
     
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/12/18..    11.30am)
                  ముక్కోటి ఏకాదశి సందర్బంగా జెపి రోడ్డులోని శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజమున 4 గంటల నుంచి స్వామి వారి దర్శనాన్ని " ఉత్తర ద్వారం" ద్వారా భక్తులకు దర్శనం కలగజేశారు. ఆలయ ఈవో రుద్రరాజు గంగా శ్రీదేవి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు వాడపల్లి ఆదినారాయణ చార్యులు ఆధ్వర్యంలో స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తులసి పూజ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో యశస్విని, మనస్విని బృందంచే అన్నమయ్య పద సంకీర్తనలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!