• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • కెజియఫ్ సినిమా రివ్యూ (21/12/18)

    Posted on 21 Dec, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/12/18..   05.30pm)
                 విడుదలకు ముందే ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న చిత్రం కెజియఫ్. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

    కథ :
              కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ప‌వ‌న్ (య‌ష్‌) త‌న త‌ల్లికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా త‌న‌కంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవ‌డం కోసం ముంబై వ‌చ్చి నేర సామ్రాజ్యంలో రాకీగా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ క్ర‌మంలో కోలార్ గ‌నుల్లో నియంత‌గా అధిప‌త్యం చ‌లాయిస్తున్న గ‌రుడ‌ను చంపితే ముంబై త‌న‌దే అని.. య‌ష్‌కు ఒక పెద్ద ఆఫ‌ర్ వస్తుంది. దీంతో అత‌న్ని చంప‌డానికి బెంగుళూరు వ‌చ్చిన రాకీ, గ‌రుడ‌ను చంపే అవ‌కాశం వ‌చ్చినా చంప‌కుండా, కోలార్ గ‌నుల్లోకి ఎంట‌ర్ అవుతాడు. అస‌లు రాకీ టార్గెట్ ఏంటి ? త‌న త‌ల్లిక ఇచ్చిన మాట ను నెరవేర్చడా ? చివ‌రికి గ‌రుడ‌ ఏమయ్యాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

    ప్లస్ పాయింట్స్ :
            హీరో యష్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. స్టైలిష్ లుక్ తో సినిమా అంత వన్ మ్యాన్ షో చేశాడు. ఇక హీరో ఇంట్రో సీన్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ లు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేర నటించింది.  స్పెషల్ సాంగ్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామరస్ గా కనిపించింది. ఇక ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ కథ రాసుకోవడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

    మైనస్ పాయింట్స్ :
             ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ కోలార్ గోల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప‌క్కాగా స్క్రిప్ట్ రాసుకోలేదు. హీరోను ఎలివేట్ చేయ‌డం మీదనే శ్రద్ధ పెట్టు క‌థ‌నం గురించి మర్చిపోయాడు. హీరో ఇమేజ్ కు తగ్గట్లు యాక్ష‌న్ స‌న్నివేశాలతో నింపేసిని ద‌ర్శ‌కుడు, ఎమోషనల్ స‌న్నివేశాలను పట్టించుకోలేదు. ఇంట‌ర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని రేపిన ఆది ఎక్కువ సేపు ఉండేలా చూసుకోలేదు. దాంతో సెకండ్ హాఫ్ కూడా ప్రేక్ష‌కుల‌ను నిరాశకు గురిచేస్తుంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!