• Category Banner Ad
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • అంతరిక్షం సినిమా రివ్యూ (21/12/18)

  Posted on 21 Dec, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/12/18..   05.30pm)
              ‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

  కథ :
          వరుణ్ తేజ్(దేవ్) ఐదు సంవత్సరాల క్రితం చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ లో అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థుతుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కోల్పోవడంతో పాటు, తన విప్రయాన్ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ మిషన్ ను పూర్తి చెయ్యడానికి వరుణ్ దేవ్ (వరుణ్ తేజ్) అవసరం ఏర్పడుతుంది. ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో దేవ్ కి కొన్ని సమస్యలను ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని దేవ్ వాటిని ఎలా పరిష్కరించాడు ? అలాగే తన విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? రెండు మెషన్ లను దేవ్ తన బృందంతో ఎలా విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

  ప్లస్ పాయింట్స్ :
           తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పేస్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పైగా ఇంతవరకు తెలుగులో అంతరిక్షం బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా కూడా రాకపోవడంతో ఈ ‘అంతరిక్షం’ తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది. దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అతిథిరావ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.  సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కథ అంతరిక్షంలోనే జరుగుతోందనే నమ్మకాన్ని కలిగించాయి. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పేస్ తాలూకు సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు.

  మైనస్ పాయింట్స్ :
          ‘అంతరిక్షం’ నేపథ్యంలో కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్నిమాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు.
  సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు. సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందుకి వరకు కథనం నెమ్మదిగానే సాగుతుంది. పైగా స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కూడా ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినీమాటిక్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా మిషన్ కిన్నెరలో వరుణ్ సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి.
   
   
  Be the first one to comment. Click here to post comment!