• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • పడి పడి లేచె మనసు సినిమా రివ్యూ (21/12/18)

    Posted on 21 Dec, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/12/18..   05.30pm)
                హను రాఘవపూడి దర్శకత్వంలో యువ హీరో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు విడుదలైయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

    కథ :
        సూర్య (శర్వానంద్) ,వైశాలి (సాయి పల్లవి ) ని తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో వైశాలి కోసం శర్వా చేసే పనుల వల్ల వైశాలి కూడా సూర్య ను ప్రేమిస్తుంది. ఇద్దరు ప్రేమలో ఉండగా వైశాలి పెళ్లి చేసుకుందాం అంటుంది. పెళ్లి మీద నమ్మకం లేని సూర్యపెళ్లి ఇష్టం లేదని ఒకరి మీద ఒకరికి చచ్చేఅంత ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకుందాం అనడంతో దానికి వైశాలి, సూర్య కు ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏంటి ? మళ్ళీ సూర్య , వైశాలి కలిసారా ? అనేదే మిగితా కథ.

    ప్లస్ పాయింట్స్ :
             సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి సూర్య , వైశాలి పాత్రలు. ఇక ఆ పాత్రల్లో నటించిన శర్వానంద్ , సాయి పల్లవి ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముందు నుంచి చెపుతున్నట్లు సినిమాలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. సూర్య పాత్ర లో నటించిన శర్వా చాలా అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ , రొమాంటిక్ , కామెడీ సన్నివేశాలను ఈజీ గా చేస్తూ మరోసారి ట్యాలెంటెడ్ హీరోగా నిరూపించుకున్నాడు. ఇక సాయి పల్లవి కూడా నటన విషయంలో శర్వా కు గట్టి పోటీ నిచ్చింది. కథ అంత వీరిద్దరూ చుట్టూ తిరగడంతో అందురు నటీనటులు వున్నా తెర మీద వీరిద్దరూ మాత్రమే ప్రత్యేకంగా అనిపిస్తారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ హాఫ్ లో తన ప్రతిభ చూపెట్టాడు. కలకత్తా కల్చర్ ను బాగా చూపెట్టాడు. విజువల్స్ సంగీతం కూడా చిత్రానికి హైలైట్ అయ్యాయి. మురళీ శర్మ , సునీల్ , ప్రియదర్శి తమ పాత్రలకు నాయ్యం చేశారు. వెన్నల కిషోర్ వుంది కాసేపేయైన తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.

    మైనస్ పాయింట్స్ :
          సింపుల్ ప్రేమ కథ కు మెమరీ లాస్ అనే అంశాన్ని జోడించి దాన్ని సంతృప్తిగా కన్వే చేయలేకపోయాడు హను. ఫస్ట్ హాఫ్ ను హైలైట్ చేసి సెకండ్ హాఫ్ ను బోరింగ్ మార్చేశాడు. ఇక ఇంటర్వల్ ముందు వచ్చే కాన్ ఫ్లిక్ట్ పాయింట్ సిల్లీ గా అనిపిస్తుంది. అప్పడిదాకా హీరోయిన్ ను పీకలదాకా ప్రేమించిన హీరో పెళ్లి చేసుకుందాం అనే సరికి బ్రేక్ చెప్పడం లాంటి విషయాలు అంత కన్విన్స్ గా అనిపించవు. సెకండ్ హాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకుడిని నిరాశకు గురి చేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ మరి సినిమాటిక్ గా ఉండడం ఎంగేజింగ్ గా లేని నరేషన్ సినిమాపై ప్రభావం చూపించింది. ఫస్ట్ హాఫ్ లోలాగే సెకండ్ హాఫ్ ను ఆసక్తికరంగా చూపించి ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.
     
     
    Be the first one to comment. Click here to post comment!