• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రివ్యూ (10/1/19)

    Posted on 09 Jan, 2019 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/1/19..    10.30am)
               ఈ ఏడాది మచ్ అవైటెడ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాలమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

    కథ :
                 ఎన్టీఆర్ ( బాలకృష్ణ ) రిజిస్టారర్ గా పనిచేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వున్న అవినీతి నచ్చక జాబ్ కు రాజీనామా చేసి సినిమాల్లో కి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి ? ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

    ప్లస్ పాయింట్స్ :
               సినిమాలో బాలకృష్ణ నటన మేజర్ హైలైట్ అయ్యింది. ఆయనకెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈపాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ తరువాత నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం, ఏ యన్ ఆర్. ఈ పాత్రల్లో నటించిన విద్యా బాలన్ , సుమంత్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విద్యా బాలన్ బసవ తారకం పాత్రకు కరెక్ట్ గా సరిపోయింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణుడి ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రింట్ సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా చూపెట్టాడు చూపెట్టాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా సినిమాను ఎండ్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. దాంతో సెకండ్ పార్ట్ ఫై ఆసక్తిని తీసుకురాగలిగాడు క్రిష్.

    మైనస్ పాయింట్స్ :
              సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. బయోపిక్ సినిమాలంటే ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్ నరేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. ఇక ఫస్ట్ హాఫ్ ను పాత్రలను పరిచయడం చేయడానికే తీసినట్లుగా అనిపిస్తుంది. అందులో భాగంగా వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక బాలకృష్ణ , విద్యా బాలన్ , ఏ ఎన్ ఆర్ పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. అలాగే నటన పరంగా మెప్పించిన బాలకృష్ణ లుక్ పరంగా ఎన్టీఆర్ ను మ్యాచ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యంగ్ ఎన్టీఆర్ లుక్ కు బాలయ్య సెట్ కాలేదు. సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగా సాగడం కూడా సినిమాకి మైనస్సే అయ్యింది. గ్రిప్పింగ్ నరేషన్ తో మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.
     
     
    Be the first one to comment. Click here to post comment!