• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • భీమవరం క్రికెట్ లీగ్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..      12.00pm)
                 క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడలను ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. స్థానిక లూథరన్ హైస్కూల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన భీమవరం క్రికెట్ లీగ్ పోటీలను అయన ప్రారంభించి మాట్లాడారు. నేటి యువతలో క్రీడా స్ఫూర్తి బాగా పెరిగిందని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. వన్ టౌన్ సిఐ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్బంగా ఇటువంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నేటి యువత చేదు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. అనంతరం సరదాగా వారు క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో ఎన్ విఆర్ దాస్, కోడె యుగంధర్, కామన నాగేశ్వరరావు, గంట సుందర కుమార్, నిర్వాహకులు రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 
                      
     
     
    Be the first one to comment. Click here to post comment!