• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • పేదలందరికీ సొంత ఇల్లు .. అదే టిడిపి లక్ష్యం .. ఎమ్మెల్యే అంజిబాబు (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..    12.00pm)
                రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పట్టణంలోని 37,38,39వ వార్డులో జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేసేందుకు ముఖ్యమంత్రి పట్టుదల కలిగి ఉన్నారన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదవారికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను ఇస్తున్నారన్నారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఎక్కువ వైద్య ఖర్చులు అయితే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, కమిషనర్ సిహెచ్ నాగ నరసింహా రావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, ఎపి అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణ రాజు, ముదునూరి సూర్యనారాయణ రాజు, కౌన్సిలర్లు చెన్ను శాంతి  తదితరులు పాల్గొన్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!