• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • విజ్ఞానభారతి స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..   04.00pm)
                   భీమవరం మండలం చిన అమిరం విజ్ఞాన భారతి స్కూల్లో సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రంగవల్లులు, సంప్రదాయమైన దుస్తులను ధరించి గొబ్బిళ్ళు పాటలు పాడుతూ, బొమ్మలకొలువు, హరిదాసు సంకీర్తనలతో స్కూల్ ప్రాంగణం మార్మోగింది. వివిధ వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ పోటిలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో స్కూల్ సంయుక్త కార్యదర్శి సుబ్బారావు, లక్ష్మీపతి రాజు, కె మురళీకృష్ణ, బ్రహ్మరాజు, సాకేత్ వర్మ, ప్రసాదరాజు, పార్వతి,   విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!