• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • విద్యార్థులు సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి (11/1/19)

    Posted on 11 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/19..   04.00pm)
                  విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శుక్రవారం రాయలం, చిన అమిరం గ్రామంలో వైట్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించి, అంగన్ వాడి విద్యార్థులకు విద్యాసామాగ్రి అందించారు. కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ లు బుద్దరాజు శ్రీనివాసరాజు, కోళ్ల రామచంద్రరావు, తోట బాలకృష్ణ,   ప్రిన్సిపాల్ ఏ అనురాధ, వైస్ ప్రిన్సిపాల్ కె సురేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆపీసర్స్ బి మావుళ్లు, లక్ష్మి సుధా, సాయి శ్రీనివాస్, శంకర్ ఆనంద్, వి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!