• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ యల్లాప్రగడ 124వ జయంతి వేడుకలు (12/1/19)

    Posted on 12 Jan, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/01/19..    04.30pm)

                    డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు 124వ జయంతి వేడుకలను భీమవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో శనివారం నిర్వహించారు. ముందుగా అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు పి రఘురామ్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు అవసరమైన ప్రాంతకవ్యాధులను నివారించే మందులను కనిపెట్టిన మహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు అని కొనియాడారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కౌన్సిలర్ ఎద్దు ఏసుపాదం, నంద్యాల సుబ్బారావు, ఎం గోవింధబాబు, ఎద్దు కాంతామణి, నసీమాబేగం, చిరంజీవి, ఎండి షబీనాబేగం తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!