• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • ఓటుహక్కును సద్వినియోగం చేసుకోండి .. కమిషనర్ నరసింహారావు (19/1/19)

    Posted on 19 Jan, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/1/19..   04.30pm)
                భారతీయుడిగా ఓటుహక్కు నీతి నిజాయితీ నిబంధలతో వేసి పౌరునిగా మన భాధ్యతను నిర్వర్తించాలని, ఓటును అమ్ముకుని దుర్వినియోగ చేయడం అప్రజస్వామిక చర్యని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం రెవెన్యూ శాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వరంలో శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ ప్రతిజ్ఞ, ఓటు విలువ ఓటు అవగాహనపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నరసింహారావు మాట్లాడుతూ ఓటు శాశ్వతమని, నోటు అశాశ్వతమని ఓటును వేయకపోవడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కాళీ బాబు తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!