• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • మణికర్ణిక – ది క్వీన్ అఫ్ ఝాన్సీ సినిమా రివ్యూ (26/1/19)

    Posted on 25 Jan, 2019 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (26/1/19..    10.30am)
                  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. భారీ బడ్జెట్ తో ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం హిందీ తో పాటు తెలుగులోనూ విడుదలైయింది.  
    కథ :
            ఆంగ్లేయుల నుండి ఝాన్సీ రాజ్యాన్ని కాపాడడం కోసం భీతుర్ సామ్రాజ్య యువరాణి మణికర్ణిక (కంగనా రనౌత్) ను ఆ రాజాన్ని పాలిస్తున్న నవల్కర్ వంశస్థులు కోడలుగా చేసుకుంటారు. ఇక ఆతరువాత మణికర్ణికా , ఝాన్సీ లక్ష్మి భాయ్ గా ఎలా మారింది ? ఆమె కంపెనీ నుండి ఝాన్సీ ని కాపాడుకుందా లేదా ? ఆంగ్లేయులు మీద ఏ విధంగా పోరాటం చేసిందని తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

    ప్లస్ పాయింట్స్ :
           కంగనా రనౌత్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. సినిమా మొత్తాన్ని ఆమె భుజాలపై వేసుకొని నడిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. వీరనారి గా ఆమె చేసే సాహసాలు నచ్చుతాయి. ఇక ఆమె ఇంట్రడక్షన్ సీన్ కూడా చాలా బాగుంది అలాగే సపోర్టింగ్ రోల్స్ లో నటించిన అతుల్ కులకర్ణి , అంకిత లోఖండే , మిస్తీ చక్రవర్తి వారి పాత్రల్లో చాలా బాగా నటించారు. సినిమా మరో మేజర్ ప్లస్ పాయింట్ విజువల్స్. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాకి విజువల్సే ప్రాణం పోస్తాయి. ఈ విషయంలో ఈచిత్ర మేకర్స్ 100శాతం సక్సెస్ అయ్యారు. 1800 కాలం నాటి వాతావరణాన్ని తెర మీద అద్భుతంగా చూపించారు. తెర మీద సినిమా చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ తరువాత వచ్చే యుద్ధ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా అనిపించాయి.

    మైనస్ పాయింట్స్ :
            సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే స్టోరీ లో డెప్త్ లేకపోవడమే. కథ కు తోడు కథనం కూడా మామూలుగానే అనిపిస్తుంది. సినిమా అంత ఊహాజనితంగా ఉండడంతో పూర్తిగా స్టాటిస్ఫై చేయలేక పోయింది. ఈ విషయంలో కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. ఇక నటిగా మెప్పించిన కంగాన డైరెక్టర్ గా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.  ఒక వీర వనిత లైఫ్ స్టోరీ ని తెరమీద చూపించాలన్న ఆమె ప్రయత్నం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇలాంటి ఒక బయోపిక్ ను తెరమీదకు తీసుకువచ్చేటప్పుడు ఎమోషనల్ సన్నివేశాల్లో డెప్త్ ఉండేలా చేసుకోవాలి కానీ ఈ చిత్రంలో అది మిస్ అయ్యింది. ఇక ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం సాగదీతగా అనిపిస్తుంది ముఖ్యంగామెయిన్ స్టోరీ లోకి వెళ్లడానికి దర్శకులు చాలా సమయం తీసుకున్నారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా అసంపూర్ణంగానే అనిపిస్తుంది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!