• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • ఎస్ఆర్ కెఆర్ కళాశాల వ్యవస్థాపకులు రామకృష్ణంరాజు 38వ వర్ధంతి (9/2/19)

    Posted on 09 Feb, 2019 in General |   0 Comments

     భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/2/19..    04.30pm)
                    నాగార్జున సాగర్ డామ్  నిర్మాణంలో మెటల్ కాంట్రాక్టర్ గా నాటి ప్రధాన మంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీదుగా మెటల్ కింగ్ అవార్డు అందుకున్న  భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులలో ఒకరు ప్రధాన దాత సాగి రామకృష్ణంరాజు 38వ వర్ధంతి శనివారం కళాశాలలో నిర్వహించారు. కళాశాల సెక్రటరీ ఎస్వీ రంగరాజు కళాశాలలోని రామకృష్ణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రామకృష్ణంరాజు గ్రామీణ యువతను ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని ఏర్పాటు చేసిన కళాశాల నేడు దేశ విదేశాలలో ప్రముఖ కళాశాలగా ఖ్యాతి గడించిందని అన్నారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ, పివి రామరాజు, పిఏ రామకృష్ణంరాజు, జివి పద్మరాజు, కె బ్రహ్మరాజు, కాంతారావు, జెవిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!