• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • పట్టణంలో 2124 మంది సామూహిక గృహ ప్రవేశాలు .. పట్టాలను అందించిన ఎంపీ, ఎమ్మెల్యే (9/2/19)

    Posted on 09 Feb, 2019 in General |   0 Comments


     భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/2/19..    04.30pm)
              భీమవరంలో ప్రధానిమంత్రి ఆయాస్ యోజన (pmay) కింద మంజూరైన 2124 మందికి ఇళ్ల పట్టాలు, సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని శనివారం నరసాపురం పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడి కళ్లలో ఆనందం చూడటమే చంద్రబాబు లక్ష్యమని, ఈ పట్టణంలో 2 వేలకుపైగా ఒక్కసారే ఇళ్లను అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే మిగిలినవి కూడా అందిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, ఎపి అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణ రాజు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణ రాజు, మెరగని నారాయణమ్మ, ఇందుకూరి రామలింగరాజు, ఎల్ అండ్ టి సుధాకర్, కౌన్సిలర్ భూపతిరాజు శ్రీనివాస వర్మ, నౌషాద్, మెంటే గోపి, అల్లూరి నాగవల్లి, యాతం నాగలక్ష్మి, కోరాడ కళ్యాణి, పాలవెల్లి మంగ, తటవర్తి రాధా, యాళ్ల వెంకటేశ్వరరావు, పంతం సతీష్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!