• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ఎక్సైజ్‌ దాడుల్లో 189 మంది అరెస్టు .. 285 మందిపై బైండోవర్‌ కేసులు (11/2/19)

    Posted on 10 Feb, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/2/19..    10.00am)
                  మద్యం అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఆ శాఖ జిల్లా ఉప కమిషనర్‌ వైవీ భాస్కరరావు ఆదేశాల మేరకు గతనెల 31నుంచి ఫిబ్రవరి 9 వరకు గొలుసు దుకాణాలపై ప్రత్యేక దాడులు చేశారు.  జిల్లా వ్యాప్తంగా 17బృందాలతో దాడులు చేసి 189 మందిని అరెస్టు చేశారు. 285 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. గొలుసు దుకాణాలు నిర్వహిస్తూ విడి మద్యం అమ్ముతున్న వారిపై 147 కేసులు, నాటుసారా విక్రయిస్తున్న వారిపై 11 కేసులు, బెల్లం ఊటకు సంబంధించి రెండు కేసులు, సమయపాలన పాటించని దుకాణాలపై 29 కేసులు నమోదుచేసి మొత్తం 189 మందిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గొలుసు దుకాణాలను నిరోధించేందుకు ఏలూరు యూనిట్‌ పరిధిలో 225 మంది, భీమవరం యూనిట్‌ పరిధిలో 60 మందిపై బైండోవరు కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!