• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ప్రారంభం (11/2/19)

    Posted on 10 Feb, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/2/19..    10.00am)
                  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కు న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక (ఏపీ భవన్‌) నుంచే మరోసారి చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఎన్డీయే మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండి చెయ్యి చూపడంతో సీఎం చంద్రబాబు ఈ సారి దిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు. దీంతో దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ వేదికగా సోమవారం దీక్షను ప్రారంభించారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు.అంతకు ముందు సీఎం చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ దీక్షకు ఏపీ నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!