• Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • దేవ్ సినిమా రివ్యూ (14/2/19)

    Posted on 14 Feb, 2019 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/19..      04.30pm)
                 ఖాకి’ తరువాత కార్తి , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం గురువారం తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలైయింది 
    కథ :
                దేవ్ ( కార్తి ) కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరెస్టు ఎక్కాలని లక్ష్యం గా పెట్టుకుంటాడు. ఇక పేస్ బుక్ లో మేఘన ( రకుల్) ను చూసి ఇష్టపడతాడు. అయితే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కాని మేఘన మొదట నో చెప్పిన ఆతరువాత దేవ్ ను లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఇద్దరు డీప్ లవ్ లో ఉండగా కొన్ని కారణాల వల్ల దేవ్ ను మేఘన అపార్ధం చేసుకుని యూఎస్ వెళ్ళిపోతుంది. ఆతరువాత వారిద్దరూ మళ్ళీ కలిశారా ? దేవ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

    ప్లస్ పాయింట్స్ :
                సినిమా కి మేజర్ ప్లస్ అంటే కార్తినే . తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మేఘన పాత్రకు రకుల్ కరెక్ట్ గా సెట్ అయ్యింది. వారి ఇద్దరి జోడి బాగుంది. సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ లు వారి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. 
     సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే విజువల్స్ , సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎవరెస్టు ఎపిసోడ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాలో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి.

    మైనస్ పాయింట్స్ :
                 సినిమా కు మేజర్ మైనస్ పాయింట్ స్టోరీనే. రొటీన్ స్టోరీ దానికి తోడు ఫ్లాట్ నరేషన్ సినిమాను బోరింగ్ గా మార్చేశాయి. ఎక్కడ ఆసక్తికర మలుపులు లేకుండా ఊహించిన విధంగా సాగిపోతుంది ఈ సినిమా. ఇక హీరో , హీరోయిన్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కన్విన్సింగ్ గా అనిపించదు. సినిమా లో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ వంటి యాక్టర్స్ ను సరిగ్గా ఉపోయోగించుకోలేదు దర్శకుడు. వారి పాత్రలు ఏమంత ప్రత్యేకంగా అనిపించవు అలాగే క్లైమాక్స్ కూడా సరిగ్గా తెరకెక్కించ లేకోపోయాడు. అప్పటి దాక హీరోకు దూరంగా వుండాలనుకున్న హీరోయిన్ సడెన్ గా మారి మళ్ళీ హీరో దగ్గరికి వచ్చేయడం లాంటి విషయాలు చుస్తే సినిమా లో స్టోరీ ఎంత వీక్ గా ఉందో అర్ధం అవుతుంది. 
     
     
    Be the first one to comment. Click here to post comment!