• Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అద్వితీయం (06/03/19)

    Posted on 06 Mar, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/3/19.. 4.00pm)
                   కేవలం ఉత్తీర్ణత కోసం చదవడం వ్యర్థమని, ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, దీనికి తోడు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు అద్వితీయమని జిల్లా విద్యాశాఖాధికారి బి రేణుక అన్నారు. పట్టణంలో ప్రభుత్వపాఠశాలలో 10వ తరగతి 520 మంది విద్యార్థులకు జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష సామాగ్రి అందించారు. ఈ సందర్బంగా రేణుక మాట్లాడుతూ ఈ పరీక్ష సమయంలో యోగ, సంగీతం కూడా శిక్షణ ఇస్తూ పరీక్షలకు ప్రోత్సహిస్తున్న కార్యక్రమాలు గొప్ప విషయాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, పిప్పళ్ల ప్రసాద్, వివిఎస్ శర్మ, ఆర్వీ రమణ, జ్యోతి, రాములు, కలిగొట్ల గోపాలాశర్మ, ఎం నిర్మల, కారి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!