• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • శోభయమనంగా సాగిన సోమేశ్వర స్వామి తెప్పోత్సవం (6/3/19)

    Posted on 06 Mar, 2019 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/03/19.. 08.30pm)
                   శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని గునుపూడిలోని శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక చంద్ర పుష్కరేణిలో ప్రత్యేకంగా అలంకరణ చేసిన హంస వాహనంపై స్వామి తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని తెప్పోత్సవాన్ని తిలకించారు. 

     వైభవంగా భీమేశ్వర స్వామి తెప్పోత్సవం
             శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీభీమేశ్వర స్వామి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక వీరమ్మ పార్క్ లో ప్రత్యేకంగా అలంకరణ చేసిన హంస వాహనంపై స్వామి తెప్పోత్సవం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ కోటికలపూడి గోవిందరావు తెప్పోత్సవాన్ని ప్రారంభించారు.  ఆలయ ఈవో చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని తెప్పోత్సవాన్ని తిలకించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!