• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • ప్రతిపౌరుడు ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి .. తహసీల్దార్ సూర్యారావు (7/3/19)

    Posted on 07 Mar, 2019 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/03/19.. 04.30pm)
                   ఓటుహక్కు వినియోగించడంలో ప్రతిఒక్కరూ ఆలోచించి నీతి నిజాయితీ గల అభ్యర్థులకే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని భీమవరం తహసీల్దార్ సూర్యారావు అన్నారు. కేజీఆర్ఎల్ బి ఫార్మసీ కళాశాలలో శ్రీవిజ్ఞానవేదిక,  రెవెన్యూ శాఖ  ఆధ్వర్యంలో గురువారం ఓటు హక్కు విలువ ప్రాధాన్యతపై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ సూర్యారావు మాట్లాడుతూ పురుషులు కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ప్రతి పౌరుడు ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కళాశాల డైరెక్టర్ కవల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, మధు, మోహన్, మూర్తి విద్యార్థులు పాల్గొన్నారు
     
     
    Be the first one to comment. Click here to post comment!