• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 గో..వాహ్‌!  కుటుంబంతో చలో  (03/6/19)
Life Style

గో..వాహ్‌! కుటుంబంతో చలో (03/6/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)
                 కుర్రకారుకు కూతవేటు దూరంలో ఉండే స్వర్గం ..  ఐరోపాను మరిపించే అందాల తీరం.. గోవా ..  క్యాసినోలు.. కార్నివాల్స్‌.. పబ్బులు.. పార్టీలు..  కొంకణ తీరం కోణం ఇదే అనుకుంటారంతా! .. కానీ, ఈ చిట్టి రాష్ట్రంలో ఇంతకు మించిన విశేషాలున్నాయి. ప్రకృతి రమణీయత.. సుందర తీరాలు.. నిర్మలమైన సూర్యాస్తమయాలు.. సాగర హోరులో సాగే సాహసాలు.. ఇలా ఎన్నో!! ఇవన్నీ ఏ కొందరికో పరిమితం కాదు. అందరినీ అలరించేవే. ఈసారి గోవాకు కుటుంబంతో వెళ్లండి. అలలపై ఓలలాడండి.. తీరంలో తనివితీరా సేదతీరండి. అక్కడి వింతలను కొత్తగా ఆస్వాదించండి.
           వలస పాలకులు చివరి వరకూ మన దేశంలో వదలని ప్రాంతం గోవా. సముద్ర అందాలన్నీ ఒక్కచోటే పోగేసినట్టుండే తీరాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. అందుకే వయోభేదం లేకుండా అందరూ గో.. గోవా అనేస్తుంటారు. కుటుంబ విహారమైనా, స్నేహితులతో సరదా ట్రిప్పయినా అనుకూల పర్యాటక కేంద్రమిది. ఆహ్లాదపరిచే కొబ్బరి తోటలు, ఆ తోటల నడుమ అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే రంగురంగుల ఇళ్లు, చూసినన్ని చారిత్రక వారసత్వ కట్టడాలు,  జాలీస్పాట్‌లు ఇలా విహార పర్వం విజయవంతం చేసే నెలవులెన్నో గోవాలో కొలువుదీరాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో యువత కేరింతలతో ఊగిపోయే గోవా.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అందరి విహార కేంద్రమవుతుంది. వినోదాల్లో తేలిపోయే కుటుంబాలు, అలల ఆలింగనంతో చెదిరిపోయే కొత్తజంటల పాదముద్రలతో సుందర తీరం మరింత మనోహరంగా కనిపిస్తుంది.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work