• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ వీడ్కోలు
Cricket

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్‌ వీడ్కోలు

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/6/19.. 04.30pm)

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్‌ కోసం తన రక్తం, స్వేదం ధారపోశానన్నారు. క్యాన్సర్‌ బాధితులకు సాయం అందించడమే తన తదుపరి లక్ష్యమని ప్రకటించిన యువీ..  జీవితంలో తనపై తాను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదని తెలిపారు. క్రికెట్‌ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పిందని యువరాజ్‌ తెలిపారు.  e="font-size:18px;">అంతర్జాతీయ క్రికెట్‌ ప్రస్థానం

 
యువీ 2000 సంవత్సరం అక్టోబర్‌లో కెన్యాపై అరంగేట్రం చేసి 304 వన్డేలు ఆడాడు.  ఈ ఫార్మాట్‌లో 14 శతకాలతోపాటు 42 అర్ధశతకాలు సాధించాడు. వన్డేల్లో 8701 పరుగులు పూర్తిచేయగా.. 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2017లో కటక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (150) చేశాడు.  2003 అక్టోబర్‌లో సొంత మైదానం మొహాలీలో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. మొత్తం 40 టెస్టులు ఆడి మూడు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 1900 పరుగులు పూర్తి చేశాడు. అలాగే  టీ20ల్లో 58 మ్యాచ్‌లు ఆడి 1177పరుగులు చేయగా 9 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టెస్టు మ్యాచ్‌  ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.
 
2011 ప్రపంచకప్‌: ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌
2011 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన యువీ.. టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే అదే సమయంలో క్యాన్సర్‌తో పోరాడినా ఎవరికీ చెప్పలేదు. ప్రపంచకప్‌ తర్వాత విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకున్న యువీ.. ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులకు ఆదర్శంగా నిలిచాడు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work