• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
షరతులు షాకిస్తాయి!  ఓసారి సరిచూసుకోండి  (03/6/19)
Life Style

షరతులు షాకిస్తాయి! ఓసారి సరిచూసుకోండి (03/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)
                వేసవి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. మొబైల్‌ చేతిలోనే ఉంది కదాని... ఆన్‌లైన్‌లో అమాంతం దూకేయకండి... ధర తక్కువ కదాని... చకచకా బుక్‌ చేయకండి... ఎందుకు? ఏమిటి? ఎలా?... ఒక్కసారి సరిచూసుకోండి... లేదంటే అందులోని షరతులు మీకు షాకిచ్చే ప్రమాదం ఉంది...
         ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థలు అందించే ప్యాకేజీల ధర తక్కువగా ఉండటం బడ్జెట్‌ ట్రావెలర్స్‌కు కలిసి వచ్చే అంశం. అయితే, వాటిని ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి వాటిల్లో చాలావరకు టికెటింగ్‌ (ప్రయాణ టికెట్లు), బస, ఎయిర్‌పోర్ట్‌ పికప్‌ మాత్రమే అందజేస్తాయి. భోజన వసతి, స్థానిక విహారం, సందర్శన స్థలాల్లో ప్రవేశ టికెట్లు లాంటివి ప్యాకేజీలో అందించరు. అందుకనే వీటి ధర తక్కువగా ఉంటుందని పర్యాటక రంగ నిపుణుల మాట. ఇవన్నీ ప్యాకేజీలో ఉన్నాయో లేదో తెలుసుకొని బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. పైగా బుకింగ్‌కు ముందే ప్రయాణ ప్రణాళిక గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏఏ ప్రదేశాలు చూపిస్తారు, ఒక్కో ప్రాంతానికి ఎంత సమయం కేటాయిస్తారు, ఏ స్థాయి హోటల్‌లో బస ఉంటుంది.. తదితర వివరాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని బుక్‌ చేసుకోవాలి.
      ఆన్‌లైన్‌లో టూర్‌ ఎంచుకున్నా, ట్రావెల్‌ ఆపరేటర్‌ని సంప్రదించినా, సొంతంగా బయల్దేరినా.. కొన్ని విషయాలపై స్పష్టత వచ్చాకే.. విహారానికి పచ్చజెండా ఊపాలి. పర్యాటక కేంద్రానికి ఎలా వెళ్లినా.. ఏ కాలంలో ఎక్కడికి వెళ్తున్నామన్నది ప్రధానం. ఎంపిక పూర్తయ్యాక.. ఆ ప్రదేశం గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. అక్కడ చూడాల్సినవి, ప్రత్యేకతలు, హోటల్స్‌ తదితర వివరాలు తెలిసుండాలి. ఎక్కడ ఎంత సమయం ఉండాలి, బడ్జెట్‌ ఎంత అవుతుందో అంచనాకు రావాలి. సొంతంగా వెళ్తున్నట్లయితే బస ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఎలా వెళ్లాలో నిర్ణయానికి రావాలి. మనం వెళ్తున్న పర్యాటక కేంద్రం గురించి కొద్దో గొప్పో అవగాహన ఉంటే.. ట్రావెల్‌ సంస్థల నుంచి పూర్తి స్థాయి సేవలు పొందవచ్చు.
 
You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work