• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 లో వోల్టేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే గ్రంధి (11/6/19)
General

లో వోల్టేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే గ్రంధి (11/6/19)

 

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/6/19..        04.00pm)
                భీమవరం నియోజక వర్గంలో    లో వోల్టేజీ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఎస్‌ ఇ బి సత్యనారాయణకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం విద్యుత్‌ ఎస్‌ ఇ బి సత్యనారాయణ, డిఇ శ్రీరామచంద్రమూర్తి, ఏడిఇ వెంకటేశ్వరరావులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గ్రంధి మాట్లాడుతూ నియోజక వర్గంలో లో వోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే ఈ సమస్యపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే నాణ్యతమైన విద్యుత్‌ ను ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద, బలుసుమూడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ పనులు త్వరగా పూర్తి అయితే ఆ ప్రాంతాలకు లో వోల్టేజీ సమస్య తలెత్తదని అన్నారు. పట్టణానికి అదనంగా మరొక ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ను రూ 5 కోట్లతో నిర్మించనున్న నేపధ్యంలో దాతల ద్వారా స్థల సేకరణ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడకుండా చూడాల్సి బాధ్యత అధికారులపై ఉందని, ఎక్కడైనా ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని అన్నారు. ఎస్‌ ఇ సత్యనారాయణ మాట్లాడుతూ ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ ల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులుండవని, విద్యుత్‌ సమస్యలు, లో వోల్టేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work