• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
140 కిలోల గంజాయి పట్టివేత .. తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు
Crime

140 కిలోల గంజాయి పట్టివేత .. తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు

 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/6/19..      09.30am)
                కారులో గుట్టుగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు శివారు ప్రాంతం ఆశ్రం ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి దాటాక గ్రామీణ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రూరల్‌ ఎస్సై వాసు తన సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి ఆశ్రం వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా విజయవాడ వైపు వెళుతున్న ఓ కారు డిక్కీలో ఉన్న గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. విశాఖలో కొనుగోలు చేసి వీటిని తమిళనాడుకు తీసుకెళ్తుతున్నారు. డిక్కీలో ఉన్న 140 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కారును, గంజాయిని రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంజాయి ప్యాకెట్ల విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేంద్రన్‌ మునిస్వామి, ప్రభు ప్రజమన్నర్‌లను అరెస్టు చేసినట్లు వివరించారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work