• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 భానుడి తాపానికి విరుగుడు మంత్రం పఠించే ప్రాంతాలెన్నో  (03/6/19)
Life Style

భానుడి తాపానికి విరుగుడు మంత్రం పఠించే ప్రాంతాలెన్నో (03/6/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)
                సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? సూరీడు సుర్రుమంటుంటే.. ఎటు వెళ్తామని నిరుత్సాహపడకండి.. ఎండకన్నెరగని చోట్లు.. వడగాలి విసుర్లు లేని గిరులెన్నో! అలాగని ఏ హిమాలయాలకో వెళ్లాల్సిన పనిలేదు.. మన పక్క రాష్ట్రాల్లోకి తొంగిచూస్తే చాలు.. భానుడి తాపానికి విరుగుడు మంత్రం పఠించే ప్రాంతాలెన్నో!! ఆ విశేషాలే ఇవి.. అనువైన చోటుకు వెళ్లండి. భగభగలను తప్పించుకోండి.
      పచ్చదనానికి ఆలవాలమైన కర్ణాటకలో వేసవి విడుదులు ఎన్నెన్నో. ఎండకు చల్లని గొడుగు పట్టే కొడుగు ప్రాంతం.. వడగాలిని మలయమారుతంగా మార్చే గిరులు.. కన్నడసీమను చల్లగా ఉంచు తున్నాయి. ఈ రాష్ట్రంలో పడమటి కనుమలు పరుచుకున్న చోటంతా పర్యాటక కేంద్రాలే! వాటిలో ఒకటి కెమ్మనగుండి. సముద్రమట్టానికి సుమారు 1450 మీటర్ల ఎత్తులో ఉంటుందీ ప్రాంతం. ఒకప్పుడు మైసూరు రాజులు వేసవిలో కెమ్మనగుండికి విహారానికి వస్తుండేవారు. ఎత్తయిన కొండలు, దట్టమైన అరణ్యం, జలజలదూకే జలపాతాలు, అంతుబట్టని లోయలు ఇలా అడుగడుగున పలకరించే అందాలు కిమ్మనకుండా చూస్తూ.. గుండె నిండా ఆనందాలను మూటగట్టుకోవాల్సిందే! పడమటి కనుమల్లో భాగమైన కెమ్మనగుండిలోని పర్వత శ్రేణులను బాబా బూదాన గిరులు అని పిలుస్తుంటారు. ఈ కొండల్లోని ముల్లాయనగిరి పర్వతం.. కర్ణాటకలో అతిపొడవైనదిగా గుర్తింపు పొందింది. ఈ కొండవాలులో ట్రెక్కింగ్‌ చేస్తుంటారు. మౌంటెయిన్‌ బైకింగ్‌ అవకాశమూ ఉందిక్కడ. బస గురించి బెంగ అవసరం లేదు. రెస్టారెంట్లకు కొదవ లేదు. కెమ్మనగుండి.. చిక్కమగళూరు నుంచి 61 కి.మీ, బెంగళూరు నుంచి 273 కి.మీ. దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి నేరుగా బస్సులు, ట్యాక్సీల్లో కెమ్మనగుండి చేరుకోవచ్చు. చిక్కమగళూరు నుంచి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work