• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఆర్టీవో  అధికారుల తనిఖీలు ముమ్మరం .. 47 బస్సుల స్వాధీనం
Crime

ఆర్టీవో అధికారుల తనిఖీలు ముమ్మరం .. 47 బస్సుల స్వాధీనం

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/6/19.. 09.30am) 

సామర్థ్య పరీక్షలు చేయించుకోకుండా జిల్లాలో తిరుగుతున్న పాఠశాలల బస్సులపై రవాణా శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆ శాఖాధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ప్రాంతీయ అధికారి మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ మూడు రోజులుగా జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కరోజే 16 బస్సులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలూరులో 5, జంగారెడ్డిగూడెంలో 5, తణుకులో 3, పాలకొల్లులో ఒకటి, కొవ్వూరులో ఒకటి, భీమవరంలో ఒకటి చొప్పున బస్సులను సీజ్‌ చేశామన్నారు. మూడు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా, సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు లేని మొత్తం 47 బస్సులపై కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు విద్యా సంస్థలకు చెందిన 50 శాతం బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన వాటికి వెంటనే సామర్థ్య పరీక్షలు చేయించకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకోవడంతోపాటు సంబంధిత బస్సులను జప్తు చేస్తామన్నారు. తనిఖీల్లో రవాణా శాఖాధికారులు నాగమురళి, ఎన్‌వీఎన్‌ శ్రీనివాస్‌, సిద్ధిక్‌, ప్రసాద్‌, చైతన్యసుమ, కాశీ, పౌల్‌రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work