• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 నింగి నుంచి తొంగి చూద్దాం..  (03/6/19)
Life Style

నింగి నుంచి తొంగి చూద్దాం.. (03/6/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)
                ఎవరెస్ట్‌ ఎత్తు.. చిన్నప్పుడు పుస్తకాల్లో తెలుసుకున్నాం. ఆ పర్వతాన్ని అధిరోహించిన సాహసవంతుల కథలు... అప్పుడప్పుడూ పత్రికల్లో చదువుతున్నాం. ఎవరెస్ట్‌ ఎక్కాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉండాలి. అన్నిటికీ మించి సాధన కావాలి. అదే ఎవరెస్ట్‌ను దగ్గరగా చూడాలంటే.. మన పొరుగునే ఉన్న నేపాల్‌కు వెళ్లాలి. హిమవన్నగాన్ని చూసి మురిసిపోవడమొకటే కాదు.. మంచుకొండల్లో మహిమాన్విత ఆలయాలు సందర్శించవచ్చు. మనోహరమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. కొండల్లో, లోయల్లో విశ్రాంతిగా విహరించవచ్చు.
      పర్యాటక ప్రపంచంలో నేపాల్‌ను అందనంత ఎత్తున నిలబెట్టింది ఎవరెస్ట్‌ పర్వతం. ప్రపంచంలోనే ఎత్తయిన ఈ పర్వతాన్ని అధిరోహించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, నేపాల్‌ విహారంలో ఎవరెస్ట్‌ పర్వతాన్ని దగ్గరగా వీక్షించడమే కాదు.. ఆ శిఖరాగ్రాన్ని ఆకాశమార్గంలో పయనిస్తూ తిలకించే అవకాశమూ ఉంది. కాఠ్మాండులో పలు పర్యాటక సంస్థలు హెలికాప్టర్‌ సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ప్యాకేజీ ధర రూ.12,000 నుంచి మొదలవుతుంది. ఎవరెస్ట్‌ శిఖరం, బేస్‌క్యాంప్‌, పరిసర గ్రామాలతో పాటు అన్నపూర్ణ, ధవళగిరి, లాంగ్‌టంగ్‌ గిరులను కూడా హెలికాప్టర్‌లో చూసే అవకాశం ఉంది. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work