• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఏలూరు రేంజ్‌ పరిధిలో 37 మంది సీఐలకు బదిలీ
Crime

ఏలూరు రేంజ్‌ పరిధిలో 37 మంది సీఐలకు బదిలీ

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (22/6/19.. 09.30am)

ఏలూరు రేంజ్‌ పరిధిలో 37 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసు జిల్లాకు వీరిని బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న కొందరికి పోస్టింగులు ఇవ్వగా మరికొందరిని వీఆర్‌కు పంపారు. ఒకటి రెండు రోజుల్లో విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన ఈ బదిలీలకు ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు బదిలీల కారణంగా స్థానచలనం కలిగిన సీఐలందరూ ఎన్నికల ముందు ఆయా పోలీసుస్టేషన్లలో బాధ్యతలు  చేపట్టారు. త్వరలో మళ్లీ సీఐల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work