• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 తిరుగులేని ఫెదరర్‌, నాదల్‌ ..  క్వార్టర్స్‌లోకి ప్రవేశం (03/6/19)
Tenies

తిరుగులేని ఫెదరర్‌, నాదల్‌ .. క్వార్టర్స్‌లోకి ప్రవేశం (03/6/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)

                  మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్లో బరిలో దిగిన రోజర్‌ ఫెదరర్‌ అదరగొడుతున్నాడు. అతను ఒక్క సెట్‌ కోల్పోకుండా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన సమరంలో ఫెదరర్‌ 6-2, 6-3, 6-3తో లియానార్డో మేయర్‌ (అర్జెంటీనా)ను చిత్తు చేశాడు. గంటా 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ జోరు ముందు మేయర్‌ నిలువలేకపోయాడు. పదే పదే నెట్‌ దగ్గరకు దూసుకొస్తూ షాట్లు ఆడిన రోజర్‌.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లతో పాటు 30 విన్నర్లు కొట్టాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. ఫ్రెంచ్‌ ఓపెన్లో క్వార్టర్స్‌ చేరడం అతనికిది పన్నెండోసారి. మొత్తం మీద రోజర్‌కు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ చేరడం ఈ స్విస్‌ వీరుడికి ఇది 54వ సారి. టైటిల్‌ ఫేవరెట్‌ రఫెల్‌ నాదల్‌ కూడా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ నాదల్‌ 6-2, 6-3, 6-3తో లాండెరో (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాదల్‌ ఆరు ఏస్‌లతో పాటు 40 విన్నర్లు కొట్టాడు. స్విస్‌ స్టార్‌ వావ్రింకా అతికష్టం మీద ప్రిక్వార్టర్స్‌ దాటాడు. అతను 7-6 (8-6), 5-7, 6-4, 3-6, 8-6తో గ్రీకు యువ కెరటం సిట్సిపాస్‌ను ఓడించాడు. ఐదు గంటలకు పైగా హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్‌లో 16 ఏస్‌లు సంధించిన వావ్రింకా.. 62 విన్నర్లు కొట్టాడు. క్వార్టర్స్‌లో అతను సహచర ఆటగాడు ఫెదరర్‌తో పోటీపడనున్నాడు.ಗೆಗಳನ್ನು ಭಾರತದಲ್ಲಾಗುತ್ತಿರುವ ಆರ್ಥಿಕ ಬೆಳವಣಿಗೆಗಳನ್ನು ಭಾರತದಲ್ಲಾಗುತ್ತಿರುವ ಆರ್ಥಿಕ ಬೆಳವಣಿಗೆಗಳನ್ನು ಭಾರತದಲ್ಲಾಗುತ್ತಿರುವ ಆರ್ಥಿಕ ಬೆಳವಣಿಗೆಗಳನ್ನು

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work