• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లా .. సమష్టి ప్రదర్శనతో విజయం  (03/6/19)
Cricket

దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన బంగ్లా .. సమష్టి ప్రదర్శనతో విజయం (03/6/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)
                ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌ అద్భుత విజయంతో ఆరంభించింది. ఆదివారం దక్షిణాఫ్రికాను 21 పరుగుల తేడాతో ఓడించి మిగతా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు బంగ్లా పులులు. ఓవల్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ముష్ఫికర్‌ రహీమ్‌ (78; 80 బంతుల్లో 8×4), షకిబ్‌ అల్‌హసన్‌ (75; 84 బంతుల్లో 8×4, 1×6), సౌమ్య సర్కార్‌ (42; 30 బంతుల్లో 9×4), మహ్మదుల్లా (46 నాటౌట్‌, 33 బంతుల్లో 3×4, 1×6) సత్తా చాటడంతో బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన పెద్ద ఇన్నింగ్స్‌ దక్షిణాఫ్రికా జట్టులో ఎవరూ ఆడలేదు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (62; 53 బంతుల్లో 5×4, 1×6) పోరాటం సరిపోలేదు. దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 309 పరుగులే చేసింది. ముస్తాఫిజుర్‌ (3/67), సైఫుద్దీన్‌ (2/57), మెహదీ హసన్‌ మిరాజ్‌ (1/44), షకిబ్‌ (1/50) ఆ జట్టును కట్టడి చేశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన షకిబ్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.
 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 16; సౌమ్య సర్కార్‌ (సి) డికాక్‌ (బి) మోరిస్‌ 42; షకిబ్‌ (బి) తాహిర్‌ 75; ముష్ఫికర్‌ (సి) వాండర్‌ డసెన్‌ (బి) ఫెలుక్వాయో 78; మిథున్‌ (బి) తాహిర్‌ 21; మహ్మదుల్లా నాటౌట్‌ 46; మొసాడెక్‌ హుస్సేన్‌ (సి) ఫెలుక్వాయో (బి) మోరిస్‌ 26; మిరాజ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 21 మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు)) 330; వికెట్ల పతనం: 1-60, 2-75, 3-217, 4-242, 5-250, 6-316; బౌలింగ్‌: ఎంగిడి 4-0-34-0; రబాడ 10-0-57-0; ఫెలుక్వాయో 10-1-52-2; మోరిస్‌ 10-0-73-2; మార్‌క్రమ్‌ 5-0-38-0; తాహిర్‌ 10-0-57-2; డుమిని 1-0-10-0
 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ రనౌట్‌ 23; మార్‌క్రమ్‌ (బి) షకిబ్‌ 45; డుప్లెసిస్‌ (బి) మిరాజ్‌ 62; మిల్లర్‌ (సి) మిరాజ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 38; వాండర్‌ డసెన్‌ (బి) సైఫుద్దీన్‌ 41; డుమిని (బి) ముస్తాఫిజుర్‌ 45; ఫెలుక్వాయో (సి) షకిబ్‌ (బి) సైఫుద్దీన్‌ 8; మోరిస్‌ (సి) సర్కార్‌ (బి) ముస్తాఫిజుర్‌ 10; రబాడ నాటౌట్‌ 13; తాహిర్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 309; వికెట్ల పతనం: 1-49, 2-102, 3-147, 4-202, 5-228, 6-252, 7-275, 8-287; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 10-0-67-3; మెహదీ హసన్‌ మిరాజ్‌ 10-0-44-1; సైఫుద్దీన్‌  8-1-57-2; షకిబ్‌ అల్‌హసన్‌ 10-0-50-1; మొర్తజా  6-0-49-0; మొసాడెక్‌ హుస్సేన్‌ 6-0-38-0

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work